ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగాలకు మరింత ముప్పు ఉందా..? భవిష్యత్తులో ఐటీ ఐద్యోగాలే ఉండవా..? ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ప్రపంచాన్ని ఏలుతున్న క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీOpenExO ఫౌండర్ CEO సలీం ఇస్మాయిల్ సంచలన విషయాలు వెల్లడించారు.
కంపెనీలు ఎలా నిర్మించబడుతున్నాయో,ఎలా నడుస్తాయో వాటి స్వరూపాన్ని పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుస్తుందంటున్నరు ప్రముఖ టెక్ కంపెనీOpenExO ఫౌండర్ CEO సలీం ఇస్మాయిల్ . ఏఐ ప్రభావంతో రాబోయే రోజుల్లో $1 ట్రిలియన్ కంపెనీ కేవలం ఐదుగురికి మాత్రమే ఉపాధి కల్పించగలదన్నారు. ఏఐ వంటి టెక్నాలజీ కొత్త కంపెనీలు వాటి ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చివేస్తాయని, పెద్ద కంపెనీలకు పోటీగా చిన్న కంపెనీల పెట్టే చిన్న టీంలకు అనుకూలంగా మారుస్తాయని ఇస్మాయిల్ అన్నారు.
ఇండియా టుడే కాంక్లేవ్ 2026లో మాట్లాడిన ఇస్మాయిల్.. రాబోయే 1 ట్రిలియన్ డాలర్ కంపెనీలో కూడా బహుశా ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఉంటారన్నారు. బిలియన్ డాలర్ల విలువైన సంస్థలను నిర్మించడానికి అవసరమయ్యే వ్యక్తుల సంఖ్య, కాలక్రమేణా క్రమంగా తగ్గుతూ వస్తోందని ఆయన పేర్కొన్నారు.
వంద సంవత్సరాల క్రితం ఒక బిలియన్ డాలర్ల సంస్థను స్థాపించాలంటే సాధారణంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు అవసరమయ్యేవారు. తరువాతి దశాబ్దాలలో ఆ సంఖ్య దాదాపు 10వేల మంది ఉద్యోగులకు పడిపోయింది. అప్పటి నుంచి టెక్నాలజీ సంస్థలు మరింత తగ్గించేశాయన్నారు. Google సుమారు వెయ్యిమంది ఉద్యోగులతో ఈ మైలురాయిని చేరుకోగా OpenAI కేవలం కొన్ని వందల మందితోనే చేరుకుంది.ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర టెక్నాలజీల వేగవంతమైన అభివృద్ధి ద్వారా జరుగుతోందని అన్నారు. ఇది చిన్న టీంలు కూడా అత్యంత తక్కువ వనరులతో శక్తివంతమైన ప్రాడక్టులను రూపొందించేందుకు వీలు కల్పిస్తుందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం ఒక టూల్ మాత్రమే కాదు.. ఇది సంస్థల నిర్వహణ రూపాన్ని క్రమంగా మార్చుతుంది. AI వ్యవస్థలతో పనిచేసే విధంగా కంపెనీలు తమ పని విధానాలను రూపకల్పన చేయడం ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే అనేక పనులలో మానవ జోక్యం అవసరాన్ని తగ్గించడం ద్వారా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి.
భవిష్యత్తులో ఇంకా చాలామంది ఉద్యోగులను ఏఐ తో ఆటోమేట చేయనున్నారు. డాష్‌బోర్డ్‌లు, పర్యవేక్షణ వ్యవస్థలు,మినహాయింపులలో మాత్రమే మ్యాన్ పవర్‌ను వినియోగిస్తారని చెప్పడం భవిష్యత్తులో ఐటీ కంపెనీల్లో ఐటీ ఉద్యోగాలపై దొరకడం కష్టమే అనిపిస్తోంది.
